
జీతూ మాధవన్ దర్శకత్వంలో సూర్య హీరోగా నటించిన యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘సీన్’ చిత్రం ఈ నెల 6న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
ఈ చిత్రాన్ని సూర్య, జ్యోతిక సంయుక్తంగా నిర్మించగా, తెలుగులో ఎన్వీ ప్రసాద్ విడుదల చేస్తున్నారు.
సోమవారం నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకలో చిత్ర బృందం పాల్గొని సినిమాపై అంచనాలను పంచుకుంది.