
బెళగావి జిల్లా అథణి పట్టణంలో ట్రాఫిక్ పోలీసులు హెల్మెట్ ధరించలేదనే కారణంతో సుభాష్ అనే కారు డ్రైవర్‌కు రూ. 500 జరిమానా నోటీసులు పంపారు.
దీంతో ఆశ్చర్యపోయిన డ్రైవర్ స్వయంగా హెల్మెట్ పెట్టుకుని కారు డ్రైవ్ చేస్తూ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
ఈ ఘటనతో ప్రస్తుతం ఆటోమేటిక్ ఏఐ కెమెరాల పనితీరు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.