
సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ 'ఎల్లమ్మ' సినిమాతో కథానాయకుడిగా వెండితెరకు పరిచయం కాబోతున్నారు.
వేణు యెల్దండి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని దిల్‌రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్నారు.
దేవిశ్రీ ప్రసాద్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రంలోని ఆయన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్రబృందం విడుదల చేసింది.