
ఇరాన్ యుద్ధం కారణంగా తలెత్తిన సరఫరా అంతరాయాల నేపథ్యంలో రాబోయే కాలంలో క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని కరెన్సీ రీసెర్చ్ అసోసియేట్స్ అంచనా వేసింది.
2027 ఫిబ్రవరి నాటికి బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర 140 డాలర్లకు, 2030 నాటికి 500 డాలర్లకు చేరుకోవచ్చని వ్యూహకర్త ఉల్ఫ్ లిండాల్ నివేదిక హెచ్చరించింది.
ప్రపంచవ్యాప్తంగా చమురు నిల్వలు తగ్గిపోవడం మరియు ఉత్పత్తి పడిపోవడం వంటి పరిణామాలు ఈ ధరల పెరుగుదలకు ప్రధాన కారణాలుగా పేర్కొన్నారు.