పెళ్లి పేరుతో మోసం చేశాడని ఒక సినీ నటి ఇచ్చిన ఫిర్యాదు మేరకు టాలీవుడ్ దర్శకుడు పవన్ సాదినేనిని పోలీసులు అరెస్ట్ చేశారు.
మూడేళ్లు సహజీవనం చేసి, ఆ తర్వాత పెళ్లికి నిరాకరించాడని బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది.
ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు చేపట్టి నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.