
హైదరాబాద్లోని ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరగనున్న భారత్-వెస్టిండీస్ టీ20 మ్యాచ్ కాంప్లిమెంటరీ టికెట్లను బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తున్న నలుగురిని గోషామహల్ పోలీసులు అరెస్ట్ చేశారు.
పట్టుబడిన వారిలో హెచ్సీఏ సభ్యుడు సతీష్ చంద్ర శ్రీవాస్తవ, ఆయన కుమారుడు ఆకర్షిత్ శ్రీవాస్తవ ఉన్నారు.
నిందితుల వద్ద నుంచి 'నాట్ ఫర్ సేల్' అని ఉన్న 11 కాంప్లిమెంటరీ టికెట్లు, 8 దాండియా పాస్లు, ఒక బైక్, 3 మొబైల్స్, రూ. 5,000 నగదును సీజ్ చేశారు.