Sports
టీ20 మ్యాచ్ టికెట్ల బ్లాక్ మార్కెటింగ్: హెచ్‌సీఏ సభ్యుడు అరెస్ట్

టీ20 మ్యాచ్ టికెట్ల బ్లాక్ మార్కెటింగ్: హెచ్‌సీఏ సభ్యుడు అరెస్ట్

Sakshi2h
THE BRIEF
1

హైదరాబాద్‌లోని ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరగనున్న భారత్-వెస్టిండీస్ టీ20 మ్యాచ్ కాంప్లిమెంటరీ టికెట్లను బ్లాక్ మార్కెట్‌లో విక్రయిస్తున్న నలుగురిని గోషామహల్ పోలీసులు అరెస్ట్ చేశారు.

2

పట్టుబడిన వారిలో హెచ్‌సీఏ సభ్యుడు సతీష్ చంద్ర శ్రీవాస్తవ, ఆయన కుమారుడు ఆకర్షిత్ శ్రీవాస్తవ ఉన్నారు.

3

నిందితుల వద్ద నుంచి 'నాట్ ఫర్ సేల్' అని ఉన్న 11 కాంప్లిమెంటరీ టికెట్లు, 8 దాండియా పాస్‌లు, ఒక బైక్, 3 మొబైల్స్, రూ. 5,000 నగదును సీజ్ చేశారు.