ఆంధ్రప్రదేశ్‌లోని గురుకులాల్లో చదువుతున్న 424 మంది దివ్యాంగ విద్యార్థులకు అక్టోబర్ నుంచి వారు కోరుకున్న చోట పింఛన్ అందించే విధానాన్ని ప్రభుత్వం అమలు చేయనుంది.
విద్యార్థులు తమ బ్యాంక్ ఖాతాల్లో లేదా చదువుతున్న పాఠశాలల్లో పింఛన్ పొందేందుకు వీలుగా సెర్ప్ అధికారులు మ్యాపింగ్ ప్రక్రియను ప్రారంభించారు.
ప్రస్తుతం 116 మంది విద్యార్థులు బ్యాంక్ బదిలీని, 17 మంది పాఠశాలలోనే పంపిణీని, 178 మంది ఇంటి వద్దే పింఛన్ కావాలని కోరుకున్నట్లు అధికారులు తెలిపారు.