
చైనాలోని హైనాన్ ప్రావిన్స్‌లోని వెంచాంగ్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి సోమవారం రాత్రి ప్రయోగించిన లాంగ్ మార్చ్-7ఏ రాకెట్ 85 సెకన్లకే గాల్లో పేలిపోయింది.
ఈ ప్రయోగంలో శాట్-4బీ కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టాలని చైనా లక్ష్యంగా పెట్టుకుంది, కానీ అది విఫలమైంది.
రాకెట్ పేలిపోవడానికి గల కారణాలపై దర్యాప్తు ప్రారంభమైంది.