హైదరాబాద్‌లో వినాయక నిమజ్జన శోభాయాత్రకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
ఖైరతాబాద్ మహా గణపతి శోభాయాత్ర శుక్రవారం ఉదయం 6 గంటలకు ప్రారంభం కానుంది.
మధ్యాహ్నం 1:30 గంటలకల్లా నిమజ్జన ప్రక్రియను పూర్తి చేయాలని పోలీసు శాఖ ఆదేశాలు జారీ చేసింది.