
వచ్చే అక్టోబర్ నుంచి రూ.2వేల కంటే ఎక్కువ విలువైన పర్సన్-టు-మర్చంట్ చెల్లింపులపై 0.4 శాతం ఛార్జీలు విధించనుండటంతో చిన్న వ్యాపారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
కేవలం 18 నుంచి 19 శాతం మార్జిన్‌తో వ్యాపారం చేసే చిరు వ్యాపారులపై ఈ ఎండీఆర్ ఛార్జీల భారం తీవ్ర ప్రభావం చూపుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఈ ఛార్జీల కారణంగా కోట్లాది మంది చిన్న వ్యాపారులు మళ్లీ నగదు లావాదేవీల వైపు వెళ్లే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది.