
చైనా టెక్ దిగ్గజం హువావే వ్యవస్థాపకుడు, సీఈవో రెన్ జెంగ్‌ఫీ దేశం విడిచి వెళ్లారంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.
చైనాలో కఠినమైన నిష్క్రమణ నియంత్రణ చట్టాలు అమల్లోకి వచ్చిన తరుణంలో సెప్టెంబర్ 11వ తేదీ నుంచే ఆయన కుటుంబ సభ్యులతో కలిసి అందుబాటులో లేరని సోషల్ మీడియా పోస్టులు పేర్కొంటున్నాయి.
అయితే ఈ వదంతులపై అటు హువావే సంస్థ గానీ, ఇటు చైనా ప్రభుత్వం గానీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ధ్రువీకరణ లేదా ప్రకటన విడుదల చేయలేదు.