
గ్లాస్గోలో జరుగుతున్న 2026 కామన్వెల్త్ గేమ్స్‌లో మహిళల 48 కేజీల వెయిట్‌లిఫ్టింగ్ విభాగంలో భారత క్రీడాకారిణి మీరాబాయి చాను స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది.
మీరాబాయి చాను క్లీన్ అండ్ జెర్క్ విభాగంలో 105 కేజీలు, స్నాచ్ విభాగంలో 85 కేజీలు ఎత్తి, మొత్తం 190 కేజీల బరువుతో కామన్వెల్త్ రికార్డును నెలకొల్పింది.
కామన్వెల్త్ గేమ్స్‌లో వరుసగా మూడుసార్లు స్వర్ణం గెలిచిన తొలి భారతీయ మహిళా వెయిట్‌లిఫ్టర్‌గా 31 ఏళ్ల మీరాబాయి చాను చరిత్ర సృష్టించింది.