
తిరుపతిలోని అన్నమయ్య సర్కిల్ వద్ద ఉన్న సోనోవిజన్ షాపులో శుక్రవారం అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు భారీ చోరీకి పాల్పడ్డారు.
ఈ ఘటనలో 50 యాపిల్ ఐఫోన్లు, 200 ఇతర కంపెనీల సెల్ ఫోన్లు, పలు ఎలక్ట్రానిక్ వస్తువులతో కలిపి మొత్తం రూ.2 కోట్ల విలువైన సరుకు అపహరణకు గురైంది.
శనివారం ఉదయం షాపు తెరిచిన సిబ్బంది చోరీని గుర్తించి ఎస్వీ యూనివర్సిటీ పోలీసులకు ఫిర్యాదు చేయగా, సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు ప్రారంభమైంది.