
రష్యాపై ఆర్థిక ఒత్తిడి తెచ్చేందుకు ఉద్దేశించిన కఠినమైన 'గ్రాహామ్ చట్టం' కింద విధించాలనుకున్న 100 శాతం టారిఫ్స్ ఆంక్షల నుంచి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెనక్కి తగ్గారు.
నవంబర్ 3 మధ్యకాలిక ఎన్నికల నేపథ్యంలో దేశీయంగా ఇంధన ధరలను నియంత్రించడమే లక్ష్యంగా ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా మినహాయింపు ఇచ్చారు.
ట్రంప్ తీసుకున్న ఈ తాజా నిర్ణయంతో భారత్ ఎలాంటి భయాలు లేకుండా తన ఇంధన దిగుమతులను కొనసాగించడానికి భారీ ఊరట లభించింది.