
సోమవారం మధ్యాహ్నం హైదరాబాద్లోని సికింద్రాబాద్, బేగంపేట్, ప్యాట్ని, బోయిన్పల్లి, రసూల్పుర వంటి ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.
కుండపోత వాన కారణంగా నగరంలోని ప్రధాన కూడళ్ల వద్ద రహదారులు జలమయమై ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయి.
వర్షం వల్ల వాహనదారులు, విద్యార్థులు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడగా, నగర ప్రజలకు ఉక్కపోత నుంచి కొంత ఉపశమనం లభించింది.