ఐపీఎల్ రిటెన్షన్ డెడ్‌లైన్ దగ్గరపడుతున్న తరుణంలో స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాను సొంతం చేసుకునేందుకు కొన్ని ప్రముఖ ఫ్రాంచైజీలు ముంబై ఇండియన్స్ యాజమాన్యాన్ని సంప్రదించాయి.
చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే), కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) సహా పలు జట్లతో ముంబై యాజమాన్యం ప్రాథమిక చర్చలు జరిపినట్లు తెలుస్తోంది.
నవంబర్ 15 నాటికి అన్ని జట్లు తమ రిటెన్షన్ జాబితాను సమర్పించాల్సి ఉండటంతో రాబోయే వారాల్లో దీనిపై స్పష్టత రానుంది.