
వెస్టిండీస్ పర్యటన కోసం బీసీసీఐ ప్రకటించిన 15 మంది సభ్యుల భారత వన్డే జట్టులో ముగ్గురు ఆటగాళ్ల ఎంపికపై క్రీడా వర్గాల్లో చర్చనీయాంశమైంది.
తొలిసారి జాతీయ జట్టు పిలుపు అందుకున్న 26 ఏళ్ల నమన్ ధీర్‌కు 50 ఓవర్ల ఫార్మాట్లో తగినంత అనుభవం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
అలాగే లిస్ట్ ఏ క్రికెట్లో 36 మ్యాచ్‌లు ఆడి 56 వికెట్లు మాత్రమే తీసిన 29 ఏళ్ల పేసర్ ఆకిబ్ నబీని ఎంపిక చేయడం ఆశ్చర్యం కలిగించింది.