
హెచ్-1బీ వీసా కోసం లక్ష డాలర్ల ఫీజు విధించడం వల్ల ప్రతిభావంతులైన విదేశీయులు అమెరికాకు రావడానికి వెనుకాడే అవకాశం ఉందని యూఎస్ కాంగ్రెస్ సభ్యుడు రాజా కృష్ణమూర్తి ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ కొత్త నిబంధనలు అమెరికాలోని ఉద్యోగ అవకాశాలను దెబ్బతీసే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు.
ప్రతిభావంతులు అమెరికాకు దూరం కావడం వల్ల అంతర్జాతీయంగా నైపుణ్యం కలిగిన వలసదారుల రాక తగ్గే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.