
స్మార్ట్ఫోన్లు, కార్లు మొదలుకుని రక్షణ రంగం వరకు ప్రతి ఆధునిక సాంకేతిక వ్యవస్థకు సెమీకండక్టర్లు కీలకంగా మారాయి.
భారత్ ఇప్పటికే ఇండియా సెమికండక్టర్ మిషన్, డిజైన్ లింక్డ్ ఇన్సెంటివ్ వంటి కార్యక్రమాలను ప్రారంభించింది.
అయితే భారత్ కేవలం చిప్ అసెంబ్లింగ్కే పరిమితం కాకుండా డిజైన్, పరిశోధనలపై కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు.