
గ్లోబల్ డిజిటల్ పేమెంట్స్ దిగ్గజం వీసా తన మొత్తం వర్క్‌ఫోర్స్‌లో 7 శాతం అంటే సుమారు 2,600 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది.
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వినియోగాన్ని పెంచడం మరియు వ్యాపార కార్యకలాపాలను పునర్వ్యవస్థీకరించే క్రమంలో టెక్నాలజీ, ప్రొడక్ట్ విభాగాల్లో ఈ కోతలను అమలు చేస్తున్నారు.
ప్రస్తుతం వీసాలో 34,100 మంది ఉద్యోగులు ఉండగా, 2024తో పోలిస్తే సిబ్బంది సంఖ్య 8 శాతం పెరిగినప్పటికీ, వ్యయ నియంత్రణ కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఈఓ ర్యాన్ మెక్ ఇనెర్నీ తెలిపారు.