
దులీప్ ట్రోఫీ ఫైనల్‌లో సౌత్ జోన్‌పై ఈస్ట్ జోన్ 584 పరుగుల భారీ ఆధిక్యాన్ని సాధించి టైటిల్ దిశగా దూసుకెళ్తోంది.
కెప్టెన్ ఇషాన్ కిషన్ 98 బంతుల్లో 80 పరుగులు, శిఖర్ మోహన్ 52 పరుగులతో రాణించి మూడో వికెట్‌కు 126 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు.
నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఈస్ట్ జోన్ తన పట్టును బిగించగా, సౌత్ జోన్ బౌలర్ విజయ్ వేసిన ఒకే ఓవర్లో ఇషాన్ 20 పరుగులు రాబట్టారు.