
సూర్యాపేట జిల్లా కోదాడ మండలం దొరకుంట శివారులో బుధవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం చెందారు.
హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్న బస్సు ముందు వెళ్తున్న కంటైనర్ డీసీఎంను బలంగా ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది.
ఈ ఘటనలో మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉండగా, 11 మందికి తీవ్ర గాయాలయ్యాయని పోలీసులు వెల్లడించారు.