
ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ డైరెక్టర్ రాష్ట్రంలోని మున్సిపల్ కార్పొరేషన్లలో వార్డుల పునర్విభజన ప్రక్రియ కోసం అధికారిక షెడ్యూల్ను విడుదల చేశారు.
ఈ ప్రక్రియ 2011 జనాభా లెక్కల ఆధారంగా జరుగుతుండగా, సెప్టెంబర్ 5 నుంచి 11 వరకు అభ్యంతరాలు స్వీకరించి, 14న గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేస్తారు.
జీవీఎంసీ, విజయవాడ, గుంటూరు, నెల్లూరు, కర్నూలు, తిరుపతి, కడప, ఏలూరు, అనంతపూర్, ఒంగోలు, చిత్తూరు, మచిలీపట్నం కార్పొరేషన్లకు ఈ ఆదేశాలు వర్తిస్తాయి.