
విజయవాడ మాషా అల్లా ఆర్థిక మోసాల బాధితులకు న్యాయం చేసేందుకు డీసీపీ తిరుమలేశ్వర్ రెడ్డి నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేశారు.
మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో జరిగిన గ్రీవెన్స్‌లో సుమారు 200 మంది బాధితులు ఫిర్యాదు చేయగా, హోం మంత్రి అనిత విచారణకు ఆదేశించారు.
తక్కువ పెట్టుబడితో అధిక లాభాల పేరుతో జరిగే మోసాలను నమ్మవద్దని, బాధితులకు త్వరితగతిన న్యాయం చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.