
వ్యాపార సంస్థల వద్ద జరిగే పెద్ద యూపీఐ లావాదేవీలపై 25 నుంచి 30 బేసిస్ పాయింట్ల మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) విధించే ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తోంది.
ప్రతి రూ.100 లావాదేవీపై సుమారు 25 పైసల కమిషన్ వసూలు చేసే ఈ విధానం, సాధారణ వినియోగదారులకు కాకుండా కేవలం మర్చంట్ అకౌంట్లకు మాత్రమే వర్తించనుంది.
ప్రస్తుతం దేశంలో 88 శాతం డిజిటల్ లావాదేవీలు యూపీఐ ద్వారా జరుగుతుండగా, ఈ ఛార్జీల ద్వారా ఏటా సుమారు రూ.13 వేల కోట్ల ఆదాయం వచ్చే అవకాశం ఉందని అంచనా.