ఆపిల్ తొక్కలో ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటం వల్ల జీర్ణక్రియ మెరుగుపడటంతో పాటు బరువు నియంత్రణలో ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
గ్యాస్ లేదా కడుపు ఉబ్బరం సమస్య ఉన్నవారు మాత్రం ఆపిల్ తొక్క తీసి తినడం మంచిదని సూచించారు.
ఆపిల్ ఆర్గానిక్ కాకపోతే పురుగుమందుల అవశేషాలు ఉండే అవకాశం ఉన్నందున, బాగా కడిగి తినాలని హెచ్చరించారు.