
పంజాబ్‌లోని ఫిరోజ్‌పుర్ జిల్లాకు చెందిన 28 ఏళ్ల కానిస్టేబుల్ గుర్ ప్రీత్ సింగ్, రాఖీ బంపర్ డ్రాలో 7 కోట్ల రూపాయల ప్రైజ్ మనీని గెలుచుకున్నాడు.
2022లో పోలీస్ శాఖలో చేరిన గుర్ ప్రీత్ సింగ్, ప్రస్తుతం 112 ఎమర్జెన్సీ హెల్ప్‌లైన్ విభాగంలో విధులు నిర్వర్తిస్తున్నాడు.
ఉద్ధమ్ సింగ్ చౌక్ వద్ద కొనుగోలు చేసిన లాటరీ టికెట్ ద్వారా ఈ భారీ బహుమతి లభించడంతో ఆయన కుటుంబంలో సంబరాలు మొదలయ్యాయి.