
పండుగ సీజన్ కలిసి రావడంతో అక్టోబర్లో దేశీయ ప్యాసింజర్ వాహనాల హోల్సేల్ విక్రయాలు 5 లక్షల యూనిట్ల మార్కును దాటాయి.
అక్టోబర్లో 5.25 లక్షల నుంచి 5.30 లక్షల మధ్య వాహనాలు అమ్ముడై ఉండవచ్చని, వార్షిక వృద్ధి 13 నుంచి 15 శాతంగా ఉంటుందని అంచనా.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో దేశీయ ప్యాసింజర్ వాహనాల విక్రయాలు 28.3 శాతం పెరిగి 20.55 లక్షలకు చేరాయి.