
హైదరాబాద్‌లో లక్షలాది ప్రాపర్టీలను 22-ఏ నిషేధిత జాబితాలో చేర్చారని, చివరకు సీఎం రేవంత్ రెడ్డి ఇల్లు కూడా అందులో ఉందని హరీశ్‌రావు ఆరోపించారు.
ప్రభుత్వం రాజకీయ ప్రత్యర్థులపై కేసుల కోసం సుప్రీంకోర్టు లాయర్ సిద్ధార్థ్ లూథ్రాకు రోజుకు రూ. 50 లక్షల ఫీజు చెల్లిస్తోందని ఆయన విమర్శించారు.
కల్యాణలక్ష్మి పథకంపై కోర్టు స్టే ఇచ్చేలా ప్రభుత్వం కావాలనే కౌంటర్ దాఖలు చేయలేదని, ఇది పేదల పట్ల నిర్లక్ష్యమని హరీశ్‌రావు పేర్కొన్నారు.