
రాబోయే 10 ఏళ్లలో ప్రపంచవ్యాప్తంగా కనీసం 100 కోట్ల హ్యూమనాయిడ్ రోబోలు అందుబాటులోకి వస్తాయని ఎలాన్ మస్క్ అంచనా వేశారు.
ఒక్కో రోబో మనిషి కంటే ఐదు రెట్లు ఎక్కువ ఉత్పాదకతను కలిగి ఉంటుందని, ఇది మానవ ఉద్యోగాలపై ప్రభావం చూపుతుందని ఆయన పేర్కొన్నారు.
2026 తొలి ఆరు నెలల్లోనే 19,100 రోబోలు షిప్మెంట్ అయ్యాయని, 2030 నాటికి ఈ సంఖ్య 5 లక్షలకు చేరవచ్చని పరిశోధనా సంస్థలు చెబుతున్నాయి.