
సంగీత్ శోభన్, అనస్వర రాజన్ జంటగా నటిస్తున్న రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ‘అంతా రాములోరు చూసుకుంటారు’ చిత్రాన్ని పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు.
గోదావరి ప్రాంతం నేపథ్యంలో సాగే ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తుండగా, రావు రమేష్, ఝాన్సీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఈ సినిమాను ‘నాట్ ఎ లవ్ స్టోరీ’ అనే ట్యాగ్‌లైన్‌తో ప్రమోట్ చేస్తూ, మారుతి మరియు శిరీష పాత్రల చుట్టూ కథను నడిపిస్తున్నారు.