
రోడ్డు ప్రమాదాలను తగ్గించే లక్ష్యంతో వాహనాల మధ్య సమాచార మార్పిడికి వీలు కల్పించే V2V కమ్యూనికేషన్ వ్యవస్థను అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ముసాయిదా నోటిఫికేషన్ జారీ చేసింది.
ఈ సాంకేతికత ద్వారా వాహనాలు ఒకదానికొకటి హెచ్చరికలు పంపుకోవడం వల్ల ప్రమాదాలను ముందుగానే గుర్తించి నివారించే అవకాశం ఉంటుంది.
ప్రభుత్వం ఈ వ్యవస్థను దశలవారీగా అమలు చేయాలని నిర్ణయించింది.