
భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనితో గతంలో తాను జరిపిన సంభాషణలు తన ఆటతీరుకు ఎంతగానో స్ఫూర్తినిచ్చాయని వెస్టిండీస్ కెప్టెన్ షై హోప్ తెలిపాడు.
మైదానంలో అనుసరించాల్సిన వ్యూహాలు, మానసిక స్థైర్యంపై ధోని చెప్పిన సలహాలు తన కెరీర్‌కు ఉపయోగపడినట్లు పేర్కొన్నాడు.
అంతర్జాతీయ క్రికెట్‌లో తన విజయాల వెనుక ధోని మార్గదర్శకత్వం కీలక పాత్ర పోషించిందని వెల్లడించాడు.