
సుమారు 7.8 కోట్ల సంవత్సరాల క్రితం జీవించిన 'డైనోసుకస్ శ్వైమరీ' అనే 31 అడుగుల పొడవైన రాక్షస ముసలి అస్థిపంజరాన్ని అమెరికాలోని జార్జియా టెల్లస్ సైన్స్ మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచారు.
ఈ జీవి డైనోసర్లను నీటిలోకి లాక్కెళ్లి వేటాడేదని, దీనికి సంబంధించిన శిలాజాలను 1979లో డాక్టర్ డేవిడ్ శ్వైమర్ గుర్తించారని శాస్త్రవేత్తలు తెలిపారు.
40 ఏళ్ల పరిశోధన తర్వాత హై-రిజల్యూషన్ 3D స్కేనింగ్ సాంకేతికతతో ఈ అస్థిపంజరాన్ని శాస్త్రీయంగా పునర్నిర్మించారు.