
నటి కృతి సనన్ నటించిన రక్షాబంధన్ ప్రకటనపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు రావడంతో ఆభరణాల తయారీ సంస్థ బుధవారం దానిని ఉపసంహరించుకుంది.
ప్రకటనలో కృతి సనన్ ధరించిన వస్త్రధారణ తీరుపై నెటిజన్లు అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ పేర్కొంది.
వివాదం ముదరడంతో సంస్థ తన అధికారిక ప్రకటన ద్వారా యాడ్‌ను తొలగిస్తున్నట్లు వెల్లడించింది.