
హైదరాబాద్కు చెందిన రాఘవ లైఫ్ సైన్సెస్ ఏపీఐ, ఇంటర్మీడియట్స్ వ్యాపారాన్ని ఆర్పీజీ లైఫ్ సైన్సెస్ లిమిటెడ్ రూ. 135 కోట్లకు కొనుగోలు చేస్తోంది.
ఈ కొనుగోలుతో ఆర్పీజీకి 29 కొత్త ఏపీఐ మాలిక్యూల్స్ అందుబాటులోకి రానున్నాయని, అంతర్జాతీయ మార్కెట్లో విస్తరణకు ఇది దోహదపడుతుందని కంపెనీ తెలిపింది.
గత రెండు నెలల్లో ఆర్పీజీ యాక్టివ్ ఫార్మా చేపట్టిన రెండో కొనుగోలు ఇది; గత నెలలో విశాఖకు చెందిన యాక్టిస్ జెనరిక్స్ను కూడా కొనుగోలు చేసింది.