
హర్మూజ్ జలసంధి మూసివేత వల్ల వంట గ్యాస్ సరఫరాకు ఏర్పడిన అంతరాయాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
భవిష్యత్తులో ఇంధన కొరత తలెత్తకుండా దేశీయంగా ఎల్పీజీ ఉత్పత్తిని పెంచేందుకు రిఫైనరీలకు ప్రభుత్వం లక్ష్యాలను నిర్దేశించింది.
పశ్చిమాసియాలో నెలకొన్న అనిశ్చితి నేపథ్యంలో ఇంధన భద్రతను పటిష్టం చేసేందుకు ఈ 'ప్లాన్ బి'ని అమలు చేస్తున్నారు.