ఆంధ్రప్రదేశ్ లోని స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి టీడీపీ తొలి జాబితాను విడుదల చేసింది. ఏడు కార్పొరేషన్లకు మేయర్, 26 మున్సిపాలిటీలు, మూడు నగర పంచాయతీలకు ఛైర్పర్సన్ అభ్యర్థుల్ని ప్రకటించింది.
మొత్తం 36 మంది అభ్యర్థులతో విడుదల చేసిన ఈ జాబితాలో బీసీలకు పెద్దపీట వేశారు. 22 మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు అవకాశం కల్పించగా, 19 మంది మహిళలకు స్థానాలు దక్కాయి.
విశాఖపట్నం, విజయనగరం జనరల్ మహిళా స్థానాల్లోనూ బీసీ మహిళలకు అవకాశం ఇచ్చారు. చిత్తూరు కార్పొరేషన్, బద్వేలు మున్సిపాలిటీలు మహిళలకు రిజర్వ్ కాకపోయినా వారిని కేటాయించారు.