
శ్రీశైలం జలాశయానికి 2,25,901 క్యూసెక్కుల భారీ వరద నీరు చేరుతుండటంతో నీటిమట్టం 871.70 అడుగులకు చేరింది.
రాయలసీమ తాగునీటి అవసరాల కోసం పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ గేట్లు ఎత్తి కృష్ణా జలాలను విడుదల చేశారు.
జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 149.062 టీఎంసీల నీరు నిల్వ ఉంది.