
ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ ప్రీ-క్వార్టర్ ఫైనల్లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు చైనాకు చెందిన వాంగ్ జి యీ చేతిలో 11-21, 21-15, 17-21 తేడాతో ఓడిపోయింది.
పురుషుల సింగిల్స్‌లో భారత యువ ఆటగాడు ఆయుష్ శెట్టి ఇండోనేషియాకు చెందిన 11వ సీడ్ అల్వీ ఫర్హాన్ చేతిలో 19-21, 11-21తో ఓటమిపాలై టోర్నీ నుండి నిష్క్రమించాడు.
సింగిల్స్ విభాగాల్లో నిరాశ ఎదురైనప్పటికీ, వరుసగా రెండు వాకోవర్లు పొంది క్వార్టర్స్ చేరిన సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి జోడీపై భారత్ ఆశలు పెట్టుకుంది.