
యెమెన్‌కు చెందిన హూతీలు సౌదీ అరేబియా రాజధాని రియాద్‌ను లక్ష్యంగా చేసుకుని క్షిపణులు, డ్రోన్లతో దాడులు నిర్వహించారు.
కింగ్ ఖాలిద్ అంతర్జాతీయ విమానాశ్రయం, ఆరామ్కో చమురు స్థావరాలపై ఆరు విడతల్లో సైనిక ఆపరేషన్లు చేపట్టినట్లు హూతీ ప్రతినిధి యాహ్యా సరీ ప్రకటించారు.
ఆదివారం రియాద్ ప్రావిన్స్ వైపు దూసుకొచ్చిన రెండు బాలిస్టిక్ క్షిపణులతో పాటు క్రూయిజ్ క్షిపణులను సౌదీ సంకీర్ణ దళాలు అడ్డుకున్నాయి.