
అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం రికార్డు స్థాయి 5,595 డాలర్ల నుంచి సుమారు 26 శాతం తగ్గగా, భారత మార్కెట్లోనూ గరిష్టాల నుంచి 23 శాతం పతనమైంది.
ఆగస్టు చివరి వారంలో ఎంసీఎక్స్‌లో 10 గ్రాముల బంగారం ధర రూ.1,64,773 వరకు వెళ్లగా, గత వారం నాటికి అది రూ.1,45,991కు పడిపోయింది.
అమెరికాలో వడ్డీ రేట్లు మళ్లీ పెరిగే అవకాశం ఉండటం, డాలర్ బలపడటం మరియు బాండ్లపై రాబడి పెరగడం వంటి పరిణామాలు పసిడి ధరలపై ఒత్తిడిని పెంచాయి.