
ప్రముఖ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ కుమారుడు ఆర్యవీర్ సెహ్వాగ్ తన తండ్రి పేరును తాను ఎలాంటి భారంగా భావించడం లేదని స్పష్టం చేశారు.
18 ఏళ్ల ఆర్యవీర్ ఇటీవల ఢిల్లీ ప్రీమియర్ లీగ్‌లో వెస్ట్ ఢిల్లీ లయన్స్ తరఫున రెండు మ్యాచ్‌లు ఆడటంతో పాటు అండర్-19 జట్టుకు ప్రాతినిధ్యం వహించారు.
బ్యాటింగ్‌ను చాలా సింపుల్‌గా ఉంచాలని, టెక్నిక్ కంటే మానసిక అంశంపై ఎక్కువ దృష్టి పెట్టాలని తన తండ్రి చెబుతుంటారని ఆర్యవీర్ వివరించారు.