తన వీరాభిమాని అంత్యక్రియలకు హాజరు కాకపోవడంపై హీరో యశ్ స్పందిస్తూ, ఆత్మహత్యలను ప్రోత్సహించకూడదనే ఉద్దేశంతోనే వెళ్లలేదని తెలిపారు.
అభిమాని మరణం తనను తీవ్రంగా బాధించిందని, అయితే ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
స్టార్ హీరోల పట్ల అభిమానం ఉండాలి కానీ, ప్రాణాలను బలి ఇచ్చే స్థాయికి వెళ్లవద్దని ఆయన అభిమానులకు విజ్ఞప్తి చేశారు.