తెలంగాణలో రాబోయే రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేయడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.
లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించారు.