
హర్యానాకు చెందిన 23 ఏళ్ల ఛవి సర్దానా ఎలాంటి కోచింగ్ తీసుకోకుండా కేవలం సెల్ఫ్ స్టడీతో 2025 హర్యానా సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఐదో ర్యాంకు సాధించింది.
ఈ పరీక్షలో ఆమె మొత్తం 675 మార్కులకు గాను 385.80 మార్కులు సాధించి అందరికీ ఆదర్శంగా నిలిచింది.
ప్రిపరేషన్ సమయంలో క్లిష్టమైన అంశాలను అర్థం చేసుకోవడానికి ఆమె చాట్‌జీపీటీని సాంకేతిక సహాయం కోసం ఉపయోగించుకున్నట్లు వెల్లడించింది.