
గణేశ్ నిమజ్జనం సందర్భంగా హైదరాబాద్లో పోలీస్ అధికారులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
ప్రధాన నిమజ్జన మార్గాల్లో సాధారణ వాహనాల రాకపోకలపై పూర్తిస్థాయి ఆంక్షలు విధించగా భారీ వాహనాలను శివార్లలోనే నిలిపివేశారు.
ఈ ఆంక్షలు రేపు ఉదయం వరకు అమలులో ఉంటాయని, పరిస్థితులను బట్టి పొడిగించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.