
సూపర్ స్టార్ మహేష్ బాబు, ప్రియాంక చోప్రా ప్రధాన పాత్రల్లో ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కిస్తున్న 'వారణాసి' చిత్రాన్ని 120కి పైగా దేశాల్లో విడుదల చేయనున్నారు.
ఈ భారీ పాన్-వరల్డ్ చిత్రాన్ని 50కి పైగా భాషల్లో డబ్ చేస్తున్నట్లు సమాచారం, ఇందుకోసం 1,600 మందికి పైగా ప్రొఫెషనల్ డబ్బింగ్ ఆర్టిస్టులను వినియోగిస్తున్నారు.
నటీనటుల భావోద్వేగాలను సహజంగా ప్రేక్షకులకు చేరవేయడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంటే మానవ స్వరాన్నే రాజమౌళి ప్రాధాన్యతగా ఎంచుకున్నట్లు సన్నిహిత వర్గాలు వెల్లడించాయి.