
టీమిండియాలో చోటు కోసం ఎదురుచూస్తున్న యువ బ్యాటర్ రింకూ సింగ్ రంజీ ట్రోఫీలో అద్భుత ప్రదర్శన కొనసాగిస్తున్నాడు.
గోవాతో జరుగుతున్న రంజీ మ్యాచ్లో ఉత్తరప్రదేశ్ జట్టు కష్టాల్లో ఉన్న సమయంలో రింకూ ఒంటరి పోరాటం చేశాడు.
ఈ మ్యాచ్లో 11 ఫోర్లు, 2 సిక్సర్లతో 118 పరుగులు సాధించి ఈ సీజన్లో వరుసగా రెండో శతకం నమోదు చేశాడు.